
* అనుమతిస్తూ సికింద్రాబాద్ కోర్టు తీర్పు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రతను ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ సికింద్రాబాద్ న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. కస్టడీలో ఆమె నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు గోపాలపురం పోలీసులు కస్టడీకి కోరారు. వారి అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో ఆమెను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సికింద్రాబాద్ కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి కూడా డాక్టర్ నమ్రత చికిత్సా విధానంలో మోసపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. చాలా మంది కావాలని నమ్రత తమను సరోగసి వైపు మళ్లించారని మరికొందరు పోలీసులను ఆశ్రయించిన నేపథ్యంలో కస్టడీలో వాటిపై విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి. అలాగే, సృష్టి కార్యకలాపాల్లో ఆర్థిక వ్యవహారాల్లో ప్రధానపాత్ర పోషించిన విశాఖలో అరెస్ట్ అచేసిన మేనేజర్ కల్యాణి ని కూడా కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.
……………………………………….