
* పార్టీ నేతలకు ఖర్గే వార్నింగ్
* స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి
* ఎలాగైనా జూబ్లీహిల్స్లో గెలవాలి
* గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ మీటింగ్
* సమావేశంలో పాల్టొన్న మల్లికార్జున్ ఖర్గే
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ ః పార్టీలో విభేదాలుంటే అంతర్గతంగా పరిష్కరించుకోవాలని రచ్చకెక్కి పార్టీ పరువు బజారున పడేమొద్దని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పార్టీ నాయకులను హెచ్చరించారు.శుక్రవారం గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ మీటింగ్ లో ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ పార్టీలో నేతల మధ్య విభేదాలు ఉంటే పరస్పరం చర్చించుకొని పరిష్కరించుకోవాలని సూచించారు.దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ
సమావేశంలో ఖర్గే రాష్ట్ర నేతలకు పలు సూచనలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలని ఖర్గే పిలుపునిచ్చారు. నేతల మధ్య సమస్యలుంటే ఇన్ చార్జిల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని అన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఉన్నికపై కూడా చర్చించినట్లు సమాచాం. ఎలాగైనా ఈ ఉప ఎన్నికలో గెలిచితీరాలని ఖర్గే అన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ,డిప్యూటీ సీఎం మల్ల భట్టి విక్రమార్క, పిసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు సిగాచీ పేలుడు ఘటనలో మృతి చెందిన వారికోసం రెండునిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
…………………………………………