
* బోరబండ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న విజయశాంతి
ఆకేరున్యూస్ హైదరాబాద్ : రాష్ట్రంలో కొన్ని దుష్ట శక్తులు పనిచేస్తున్నాయని వారు మాట్లాడే మాటలను పట్టించుకోవద్దని ఎమ్మెల్సీ విజయశాంతి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆమె బోరబండ పోచమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణను మళ్లీ దోచుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. మళ్లీ కొన్ని దుష్టశక్తులు తెలంగాణలో చొరబడడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. ఎవరినీ తెలంగాణ లో కి ఎంటర్ చేయనివ్వద్దని ఆమె అన్నారు. ఎన్నో పోరాటాలతో వచ్చిన తెలంగాణను కాపాడుకుంటూ అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అంతకు మందు ఆమె అమ్మవారిక బోనాలుయ సమర్పంచి మొక్కులు తీర్యుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు విజయశాంతిని ఆలయ మర్యాదలతో సత్కరించారు.
…………………………………………………………………..