
– ఓటరు జాబితా సవరణ ద్వారా ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించవచ్చు
– ఎంపీడీవో గుండెబాబు
ఆకేరు న్యూస్ కమలాపూర్: మండలంలోని 24 గ్రామపంచాయతీలు, వార్డుల వారిగా ముసాయిదా ఓటర్ జాబితాను శనివారం కమలాపూర్ ఎంపీడీవో గుండెబాబు విడుదల చేశారు.ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఓటర్ల జాబితాలో అభ్యంతరాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీవో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఓటరు జాబితా సవరణ ద్వారా ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించవచ్చునని ఎంపీడీవో అన్నారు. పంచాయతీ ఓటర్ల జాబితాలో కొన్ని చోట్ల చనిపోయిన వారి పేర్లు, వివాహమై అత్తగారింటికి వెళ్లిన మహిళల ఓట్లు,ఒకే ఇంటి పేరు వివిధ రకాలుగా తప్పుగా ఉన్నాయని,వాటిని సవరించాలని రాజకీయ పార్టీ ప్రతినిధులు ఎంపీడీవోకు విజ్ఞప్తి చేశారు.తన పరిధిలో ఉన్న లోపాలను సరిచేస్తూ, మిగతా వాటిని ఎన్నికల సంఘానికి పంపివ్వనున్నట్టు ఎంపీడీవో రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలిపారు.అభ్యంతరాల పట్ల ఓటరు జాబితాలో ఉన్న తప్పులను వెతికి BLO లకు అందివ్వాలని ఎంపీడీవో,తహసిల్దార్ కు సూచించారు.సమావేశంలో పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
………………………………….