* వేములవాడలో కారు బీభత్సం..
ఆకేరు న్యూస్, వేములవాడ : మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ బీభత్సం సృస్టించారు. కారు నడుపుతూ ముగ్గురిని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో (Vemulawada) జరిగింది. జిల్లాలోని రుద్రవరం వద్ద బైకును ఢీకొట్టిన కారు.. ఆగకుండా అలానే వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో దత్తయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం వేములవాడ మండలం ఆరేపల్లి వద్ద మరో బైకును కారు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఒకరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం కారును అక్కడే వదిలిన డ్రైవర్.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. కారు నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
