I Am Game Dulquer Salmaan Release
ఆకేరు న్యూస్, హైదరాబాద్: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’ విడుదల రోజే అనూహ్య సమస్యను ఎదుర్కొంది. సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు వెర్షన్ మార్నింగ్ షోలు పలు కేంద్రాల్లో రద్దయ్యాయి. దీంతో ఎంతో ఆసక్తిగా సినిమాను చూసేందుకు థియేటర్లకు వచ్చిన దుల్కర్ అభిమానులకు నిరాశ ఎదురైంది.
* సమస్య ఏంటి?
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ వెర్షన్లకు సంబంధించిన డిజిటల్ సినిమా ప్యాకేజీలు థియేటర్లకు సకాలంలో చేరకపోవడంతో ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం. సినిమా ప్రదర్శనకు అవసరమైన డిజిటల్ కంటెంట్ థియేటర్లకు అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉదయం షోలు ప్రారంభం కాలేదు. చిత్ర బృందం కూడా తెలుగు కంటెంట్ డెలివరీలో అనూహ్య సాంకేతిక సమస్య తలెత్తినట్లు వెల్లడించింది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని, కంటెంట్ అందుబాటులోకి వచ్చిన వెంటనే తెలుగు షోలు ప్రారంభమవుతాయని తెలిపింది.
* నిరీక్షణ
ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులు షో సమయానికి థియేటర్లకు చేరుకున్నప్పటికీ సినిమా ప్రదర్శన లేకపోవడంతో నిరాశకు గురయ్యారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు సహా మరికొన్ని నగరాల్లోనూ షోలు ప్రభావితమైనట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
* భారీ అంచనాలు
‘ఆర్డీఎక్స్’ ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌తో పాటు కయాదు లోహర్, ఆంటోనీ వర్గీస్, మైస్కిన్, కతిర్, సంయుక్త విశ్వనాథన్ తదితరులు నటించారు. దుల్కర్ ఇందులో డాన్ జాన్ అనే జూదగాడి పాత్రలో కనిపిస్తున్నారు. గణిత ఆధారిత బెట్టింగ్ వ్యవస్థ అతడిని ఊహించని సంక్షోభంలోకి నెట్టడం చుట్టూ కథ సాగుతుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
