Thota Somanarsaiah Kishtapuram Deputy Sarpanch
* సొంతంగా ట్రాక్టర్ నడిపి రోడ్డు గుంతలను పూడ్చిన కిష్టాపురం నేత
ఆకేరు న్యూస్,రాయపర్తి: కిష్టాపు రం గ్రామ ప్రజల సంక్షేమం, ఊరి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ ప్రజాప్రతినిధి అంటే కేవలం పదవి మాత్రమే కాదు… బాధ్యత అని నిరూపించారు రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామ ఉపసర్పంచ్ తోట సోమనర్సయ్య, గ్రామంలో అత్యంత వైభవంగా జరిగే ముత్యాలమ్మ బోనాల పండుగను పురస్కరించుకుని భక్తులకు, గ్రామీణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఊరిలో ప్రధాన రహదారులపై, అక్కడక్కడా ఉన్న పెద్ద పెద్ద గుంతల (బొందల) వల్ల రాకపోకలకు ఆటంకం కలగడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో, వాటిని వెంటనే పూడ్చాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గ్రామానికి మొర్రం తెప్పించి గుంతలలో పోయించారు.
ఈ క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో పని ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఉపసర్పంచ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయనే స్వయంగా డ్రైవర్ అవతారమెత్తి ట్రాక్టర్ నడుపుతూ, రోడ్డుపై ఉన్న గుంతలన్నింటినీ మొర్రంతో సమం చేసి శుభ్రం చేశారు. సమయానికి డ్రైవర్ లేడని మిన్నకుండిపోకుండా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించకుండా తనే నేరుగా శ్రమదానం చేసి రోడ్లను ప్రయాణానికి అనువుగా మార్చారు.
పండుగ వేళ గ్రామస్తుల కష్టాలను గుర్తించి, స్వయంగా ట్రాక్టర్ నడిపి గుంతలు పూడ్చిన ఉపసర్పంచ్ తోట సోమనర్సయ్య చొరవను, శ్రమదానాన్ని కిష్టాపురం గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ప్రశంసిస్తున్నారు. పదవిలో ఉన్నవారు ప్రజాసేవలో ఇలాంటి చొరవ చూపిస్తే గ్రామ రూపురేఖలే మారిపోతాయని, ఇతర గ్రామాల ప్రజాప్రతినిధులు, ఉపసర్పంచులు కూడా ఈయన్ను స్పూర్తిగా తీసుకుని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పలువురు కొనియాడారు

Please tell us what is wrong. Your report will be sent to the website team.
