* అమ్మ తర్వాత నాకు అమ్మలాంటిది మాధురి
* నాకు ఇష్టం లేకపోయినా రాజకీయాల్లోకి పంపాను
* మాధురిని రాజకీయాల్లోకి తీసుకెళ్లిందే వాణి
* వీడియో విడుదల చేసిన దివ్వెల మహేష్ చంద్రబోస్
ఆకేరు న్యూస్, విశాఖపట్టణం : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను(Duvvada Srinu).. భార్య.. మధ్యలో మరో మహిళ ఎపిసోడ్ లో ఇప్పుడు ఆ మహిళ భర్త కూడా లైవ్‌లోకి వచ్చారు. తన భార్యపై తనకు నమ్మకం ఉందని, ఏవో కుక్కలు మొరిగాయని అన్నీ పట్టించుకోనని మాధురి భర్త (Madhuri Husband)దివ్వెల మహేష్ చంద్రబోస్ అన్నారు. అమెరికా(America)లో ఉన్న ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. తనకు ఇష్టం లేకపోయినా మాధురిని రాజకీయాల్లోకి పంపానని, మాధురిని రాజకీయాల్లోకి తీసుకెళ్లింది వాణియే అని చెప్పారు. వాణి ఆరోపణలతో మనస్తాపం చెందానన్నారు. తన కుటుంబసభ్యులు తనకు దూరమయ్యారని, ఒంటరినయ్యాయన్న మనస్తాపంతో వీడియో విడుదల చేసినట్లు మహేష్ చెప్పారు. ఎవరితో అయినా కొంచెం క్లోజ్ ఉంటే బ్యాడ్ అనుకుంటామా అని ప్రశ్నించారు. ఫైనాన్స్ సమస్యలు ఏమీ లేవన్నారు. మా నాన్న లీడింగ్ లాయిర్, తనకు నెలకు 10 లక్షల వేతనం, వేతనం అంతా ఆమెకే ఇస్తానని అన్నారు. ఆమె కూడా మంచి డ్యాన్సర్ అని తెలిపారు. అమ్మ తర్వాత అమ్మలాంటిదే నా మాధురి అన్నారు. తనను, తన పిల్లల్ని అనవసరంగా బద్నాం చేయవద్దని కోరారు. మాధురిపై ఎవరు ఎన్ని చెప్పినా తాను నమ్మనని దివ్వెల మహేష్ చంద్రబోస్ (Divvela Mahesh Chandrabose) వెల్లడించారు. కాగా, దువ్వాడ శ్రీను కుటుంబ వివాదం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నట్లు కనిపిస్తోంది. వాణి, శ్రీను తరఫున పెద్ద మనుషులు మాట్లాడగా, వాణి కొన్ని డిమాండ్లు ఉంచిందని తెలుస్తోంది.
————————-