* భారత ప్రభుత్వం అవార్డుతో అరుదైన గుర్తింపు
* హోటల్ ప్రత్యేకతలు తెలుసుకునేందుకు జనం ఆసక్తి
* 30 ఏళ్లుగా ఇంటి భోజనం అందిస్తున్న “ఉప్పలయ్య”
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ జిల్లా(Warangal District) నర్సంపేటకు వెళ్లి ఉప్పలయ్య హోటల్ (Uppalayya Hotel)ఎక్కడా.. అని ఎవరిని అడిగినా వేళ్లన్నీదారి చూపుతాయి. అబ్బో అంత గుర్తింపా.. అది ఎంత పెద్దదో అని ఆలోచించుకుంటూ అక్కడకు వెళ్తే.. ఓ చిన్న ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇల్లే హోటల్. ఉప్పలయ్య హోటల్. వచ్చీపోయే వినియోగదారులతో కళకళలాడుతూ ఉంటుంది. నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనం అందిస్తుండడంతో ఎప్పుడూ అది బిజీగా ఉంటుంది. సుమారు 200 మందికి ఒండి వారుస్తుంది. ఇప్పుడెందుకీ ఆ హోటల్ ప్రస్తావన అనుకుంటున్నారా? 30 ఏళ్లుగా నాణ్యమైన ఇంటి భోజనం అందిస్తున్న ఆ హోటల్‌కు తాజాగా భారత ప్రభుత్వం(Govt of India) గుర్తింపు లభించింది. ఈమేరకు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రాం కార్యాలయం నుంచి నిర్వాహకులకు అధికారులు సమాచారం అందించారు.
—————————