* ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం
* స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెలంగాణ రైతులకు రుణవిముక్తి
* ఖమ్మం జిల్లా వైరా వేదికగా..
* ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేస్తున్నామని, ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ కార్యక్రమం చేపడతామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ( Batti Vikramarka ) తెలిపారు. ఇప్పటికే రెండు దఫాల్లో చేసిన కార్యక్రమంలో 5,45,407 మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, రెండు దఫాలు కలిపి 12,289 కోట్ల రూపాయలను రైతులకు అందించామని వివరించారు. ఇప్పటికే లక్ష, లక్షన్నర రుణాలను మాఫీ చేశామని, ఆగస్టు 15కల్లా రెండు లక్షల రుణాలకు సంబంధించి చర్యలు తీసుకుంటామన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ఆగస్టు 15న దేశానికి స్వాత్రంత్యం వచ్చిన రోజున, రాష్ట్రంలో ఉన్న రైతులందరిని రుణ విముక్తి చేసే ఉన్నతమైన కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సహచరులు, అందుబాటులో ఉన్న శాసనసభ్యులందరూ పాల్గొంటారని వివరించారు. ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో 2 లక్షల రుణమాఫీ చేయడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రైతు రుణమాఫీపై చాలెంజ్ విసిరారని, చాలెంట్ ను అమలు చేయడానికి డిప్యూటీ సీఎంగా, ఆర్థిక శాఖకు చెందిన వ్యక్తిగా తాను తగిన చర్యలు తీసుకున్నా అన్నారు.
——————————-