* చర్చనీయాంశంగా చైనా ప్రకటన
ఆకేరు న్యూస్ డెస్క్ : ఏ కంపెనీ అయినా ఉద్యోగానికి సాధారణంగా విద్య, అనునభవం అర్హతలుగా చూస్తారు. కానీ చైనా ( chaina ) లోని ఓ కంపెనీ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. సోషల్‌మీడియాలో వైరల్ గా మారింది. అర్హతలు లేకపోయినా సరే.. రాశి బాగుంటే సరే అంటోంది. ఫలానా రాశిలో ఇయర్ ఆఫ్ ద డాగ్ ( Year of the dog ) పుట్టిన దరఖాస్తుదారులను తీసుకోబోమని చైనా దేశంలోని ఓ రవాణా కంపెనీ ఉద్యోగ ప్రకటన జారీచేసింది. తక్కువ అర్హతలున్నా.. వేరే రాశిలో జన్మించిన వారి దరఖాస్తులను తీసుకుంటామని తెలిపింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం, గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని సాంక్సింగ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ క్లర్క్ ఉద్యోగాల కోసం పత్రికల్లో ప్రకటన విడుదల చేసింది. ‘ఇయర్ ఆఫ్ ద డాగ్’లో పుట్టిన దరఖాస్తుదారులను బ్యాన్ చేసినట్టు తెలిపింది. దీనిపై కంపెనీ ఉద్యోగి మాట్లాడుతూ, ‘కంపెనీ బాస్ రాశి ‘డ్రాగన్’. దీనికి ‘ఇయర్ ఆఫ్ ద డాగ్’కు పొంతన కుదరదు. కంపెనీకి నష్టం వాటిల్లుతుందని భావించాం’ అంటున్నారు.
——————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
