కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే.
* కట్టు కథలు చెప్పి ప్రజలను మభ్య పెటాలనుకుంటున్నారు
* మైక్ సమస్య ఉంటే కరెంట్ కట్ అంటూ ప్రచారం
* ఎన్టీపీసీని ఎందుకు నిర్మించలేదు.
* యాదాద్రి పవర్ ప్లాంట్ మీ వల్లే ఆలస్యమయింది.
* విద్యుత్ బకాయిలు రూ.1,10,690 కోట్లు
ఢిల్లీ మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఆకేరు న్యూస్ , ఢిల్లీ : మాజీ సీఎం కేసీఆర్ చెప్పేవన్ని అబద్దాలే. కట్టకథలతో ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆయన ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ సూర్యాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనరేటర్ లేదా మైక్ సమస్య వస్తే దాన్ని కరెంట్ కట్ .. అయిందని తప్పుడు ప్రచారం చేశారన్నారు. పది సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇంతగా దిగజారితే ఎట్లా అని ప్రశ్నించారు. పవర్ కట్ ఉంటే వినియోగం ఎట్లా పెరిగిందని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. వాస్తవాలు దాచి అబద్దాలు చెప్పడానికే కేసీఆర్ ప్రాధాన్యతనిస్తున్నాడన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు బీఆర్ ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే కేసీఆర్ తట్టుకోలేక పోతున్నారన్నారు. సాగు నీటి ప్రాజెక్ట్‌లు , విద్యుత్ ప్రాజెక్ట్‌ల గురించి అన్నీ అబద్దాలే చెప్పారన్నారు. నేను కేసీఆర్ లాగా కట్టుకథలు చెప్పను. అన్ని రకాల అంకెలతో సహా చెప్పదలుచుకున్నానన్నారు.
యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ కేసీఆర్ వల్లే ఆలస్యం..
కట్టిన ప్రాజెక్ట్‌ను కూడా వినియోగంలోకి తీసుకురావడం లేదని యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారు. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ విషయంలో కూడా అన్ని తప్పులే చేశారు. కేంద్ర సంస్థలకు వాస్తవాలు దాచి తప్పుడు సమాచారం ఇచ్చారు. నిజానికి బొగ్గు లభ్యత కు చాలా దూరంగా 360 కిలో మీటర్ల దూరంలో పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడమే కరెక్ట్ కాదన్నారు. అంత దూరం బొగ్గు రవాణ చేయడం వల్ల ఖర్చు తడిసి మోపెడవుతుంది. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్‌లో యాభై శాతం డొమెస్టిక్, మరో యాభై శాతం దిగుమతి చేసుకున్న బొగ్గును వాడుతామని పర్యావరణ అనుమతి తీసుకున్నారు. ఆచరణలో మాత్రం దాన్ని అమలు చేయకపోవడం వల్ల 2022 సెప్టెంబర్ 30 న ప ర్యావరణ అనుమతిని రద్దు చేశారు. అప్పడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేదు కదా.. మీరెందుకు పట్టించుకోలేదని భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
ఎన్టీపీసీ ఎందుకు నిర్మించలేదు.
ఎన్ టీపీసీని నేనే తెచ్చానని ఢాంబికాలు చెబుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఒప్పందంలో భాగంగా తెలంగాణకు 4 వేల మెగా వాట్ల విద్యుత్‌ను పొందుపరిచారు. కుట్ర పూరితంగా ఎన్టీపీసీని నిర్మించలేదు. భద్రాద్రి పవర్ ప్లాంట్ కోసం సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించాల్సి ఉంది. దాన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారు.దీని వల్ల ఎవరి ప్రయోజనం నెరవేరిందో అందరికీ తెలిసిందేనన్నారు. ఎన్టీపీసీని నిర్మించకపోవడం వెనుక కుట్ర దాగి ఉంది. ఇపుడు మనం మొదలు పెట్టినా అదీ పూర్తయ్యే వరకు ఐదు నుంచి 6 ఏళ్ళ కాలం పడుతుంది. ఆకాలానికి లెక్కవేసుకున్నా పర్ యూనిట్ కరెంట్ రూ. 8 నుంచి 9 రూపాయల భారం పడుతుంది. ప్రత్యామ్నాయ పద్దతులు ద్వారా విద్యుత్ ఉత్పత్తిన పెంచేందుకు ప్రణాళికలు సిద్దం చేశారన్నారు. దేశమంతా గ్రిడ్ న
* సొంత చికిత్స చేసుకుంటే ఉన్న పళ్ళు ఊడి పోతాయి.
ప్రపంచంలోనే అత్యద్భుతం అని చెప్పిన కాళేశ్వరం ఇపుడు పనికి రాకుండా పోయింది. మేడిగడ్డ కుంగిపోయింది. కేసీఆర్ అపర భగీరథుడిలాగా మారి ప్రాజెక్ట్‌లు కడితే మేడిగడ్డ పరిస్థితే ఉంటుందని భట్టి విక్రమార్క అన్నారు. డాక్టర్ చేయాల్సిన పని డాక్టర్లు చేయాలి. ఇంజనీర్లు చేయాల్సిన పని ఇంజనీర్లు చేయాలికదా.. మేడిగడ్డ కుంగిపోయింది బీఆర్ ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అన్న విషయం అందరికీతెలిసిందే. వెంటనే రిపేరు చేయించక పోవడం వల్లనే రైతాంగం కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. రిజర్వాయర్లు ఎక్కడా ఖాళీగా ఉన్నప్పటికీ అదీ కేసీఆర్ తప్పిదమే అవుతుంది. మేడిగడ్డ ప్రాజెక్ట్ ను ఇప్పటికే కేంద్ర డ్యామ్ సేప్టీ అధికారులు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసింది. నివేదికలు రాగానే అనుగుణంగా చర్యలు చేపడుతామని డిప్యూటీ సీఎం చెప్పారు.
* కట్టిన ఇల్లును కాల్చేశారు.
కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి ఇక వండుకుని తినడమే తరువాయి అన్నట్టు కేసీఆర్ మాట్లాడుతున్నారు. నిజానికి అసలు ఇల్లే లేదని కట్టుకున్న ఇల్లును కాల్చేశారని డిప్యూటీ సీఎం అన్నారు. పవర్ రంగంలోనే 81,516 కోట్లు అప్పు ఉందన్నారు. సింగరేణికి రూ.19,431 కోట్లు, జెన్ కోకు రూ. 9,743 కోట్లు బకాయి ఉన్నారన్నారు. మొత్తం కలిపి విద్యుత్ రంగంలోనే ఏకంగా రూ.1,10,690 కోట్లు బకాయిలున్నాయన్నారు.
రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చి గందరగోళ స్థితికి కేసీఆర్ నెట్టారని డిప్యూటీ సీఎం తీవ్రంగా విమర్శించారు.
————————–