* 20ఏళ్లలో తొలిసారి..
* రిక్టర్ స్కేల్‌పై 5.3గా భూకంప తీవ్రత
* భయంతో ఇళ్ల నుంచి జనం పరుగులు
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. భూప్రకంపనలు స్థానికులను కలవరపాటుకు గురి చేశాయి. తెలంగాణతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, జగ్గయ్యపేట, మణుగూరు, గోదావరి ఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, మంగళగిరి, చెన్నూరు, జైపూర్ మండలం, మంచిర్యాల, గంపలగూడెం పరిసర ప్రాంతాల్లో 2 సెకన్లపాటు స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయపడి.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బుధవారం ఉదయం 7.20 గంటల నుంచి 7.27 గంటల ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించిందని చెబుతున్నారు.
ఉత్తరం నుంచి దక్షిణం, దక్షిణం నుంచి ఉత్తరానికి కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు ప్రజలు తెలిపారు. హఠాత్తుగా భూమి కంపించటంతో ప్రజలు హడలిపోయారు. అసలేం జరగుతోందో అర్థం కాక.. భయంతో వణికిపోయారు. ముఖ్యంగా ఇంట్లో వంట సామాగ్రి, వస్తువులు ఉన్నట్లుండి కింద పడిపోవంతో ప్రజలు హడలిపోయారు. తెలంగాణలోని ములుగులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనలకు గురయ్యారు.
రిక్టర్ స్కేల్‌పై 5.3 పాయింట్లుగా నమోదు
రాష్ట్రవ్యాప్తంగా భూకంపం రిక్టర్ స్కేల్ పై5.3 ఐదు పాయింట్ మూడు సెకండ్లు భూమి కల్పించినట్లు అధికారికంగా సమాచారం. తెలంగాణ రాష్ట్ర మొత్తానికి ములుగు జిల్లా కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఏపీ సెంటర్ నివేదికను పరిశీలించగా భూమి లోపల 40 కిలోమీటర్ల నుండి ఈ రేడియేషన్ ఉద్భవించినట్లు అధికారులు తెలియజేశారు.
…………………………………….