
* పాలకుర్తి తహసీల్దార్ నాగేశ్వర్ రావు
ఆకేరు న్యూస్, జనగామః రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని పాలకుర్తి తహాసీల్ధార్ ఎం నాగేశ్వరరావు కోరారు. బుధవారం పాలకుర్తి తహాసీల్ధార్ కార్యాలయంలో ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమీషన్ అధికారులు వీడియో కాన్సరెన్స్ నిర్వహించారు. అనంతరం తహాసీల్ధార్ మాట్లాడుతూ ఎన్నికల్లో సూపర్వైజర్లు, బీ ఎల్ ఓ లు, ఎన్నికల సిబ్బంది ఎలాంటి ఆవాంఛనీయ సంఘటలను జరుగకుండా విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికలు సజావుగా, సక్రమంగా నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో ఉండే పరిస్తితులు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అన్నారు. సమావేశంలో ఆర్ ఐ బి.రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
………………………………………..