* నెలాఖరులోగా స్థానిక సంస్థల షెడ్యూల్
* కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలె : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రకటన వెలువడింది. నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. సోమవారం నిర్వహించే మంత్రివర్గ సమవేశంలో చర్చించిన తర్వాత ఎన్నికల తేదీపై స్పష్టం వస్తుందని చెప్పారు. కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉందన్నారు. కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. రిజర్వేషన్లకు అనుగుణంగా గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేస్తామని తెలిపారు.
…………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
