* తొలి విడతలో 33 బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం
* త్వరలో ఆర్టీసీ లో 3 వేల ఉద్యోగాల భర్తీ
ఆకేరు న్యూస్, కరీంనగర్ : రాష్ట్రమంతా ఎలక్ట్రిక్ బస్సులను పెంచే యోచనలో టీజీ ఆర్టీసీ(Tg Rtc) ఉంది. విడతలవారీగా బస్సుల లెక్కలను పెంచుతోంది. తాజాగా కరీంనగర్ రీజియన్(Karimnagar Region) కు కేటాయించిన 70 బస్సుల్లో 33 బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆదివారం ఉదయం ప్రారంభించారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. కరీంనగర్ రీజియన్ పరిధిలో 70 ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు నడుపుతామని పొన్నం తెలిపారు. ఇప్పటి వరకు 92 కోట్ల ఉచిత టిక్కెట్లు పంపిణీ చేశామని తెలిపారు.
త్వరలోనే ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. కాగా, ఎలక్ట్రిక్ బస్సుల చార్జింగ్ కోసం ఆర్టీసీ ఆరు డిపోలను ఎంపిక చేసింది. తెలంగాణలోని కరీంనగర్-2 డిపో, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, సూర్యపేట, హైదరాబాద్-2 డిపోలను ప్రైవేట్ మేనేజ్మెంట్ కు అద్దెకు ఇచ్చి ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు మేజర్స్ జేబీఎం(Jbm) సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాదులో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ సందర్భంగా ప్రకటించారు.
…………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
