ఆకేరు న్యూస్ డెస్క్ : ఇరాన్ – ఇజ్రాయిలు దాడులు, ప్రతిపదాడులతో(Iran – Israel War) పశ్చిమాసియాలో ఘోర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అయినా.. ఎవరికీ ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. తమ టార్గెట్ పూర్తయ్యే వరకు దాడులు ఆపేది లేదని ఇజ్రాయిల్ ప్రధాని మరోసారి స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. ఇప్పటికే కీలక నేతలను కోల్పోయిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయిల్ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ జనరల్ అబ్బాస్ నిల్ఫోరూషన్(Abbas Nilforushan) కూడా మరణించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ తమ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించింది. నస్రల్లా మృతి, లెబనాన్లో ఇజ్రాయిల్ దాడులపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం కావాలని కోరింది. దీంతో భద్రతా మండలిలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
