
* పార్లమెంట్ లో ఎంపీ కడియం కావ్య
ఆకేరు న్యూస్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని లోక్ సభలో ప్రస్తావించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య PM e-DRIVE పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి 2,800 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు ప్రతిపాదనను ఆమోదించాలని వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య కేంద్రాన్ని కోరారు. పార్లమెంట్ లో మంగళవారం ఆమె ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రాన్ని కోరారు.ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పర్యావరణ రక్షణతో పాటు, తెలంగాణ రవాణా రంగానికి నూతన శక్తినిస్తాయని ఎంపీ పేర్కొన్నారు.వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారి ప్రశ్నకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ స్పందిస్తూ, ప్రామాణిక GCC మోడల్‌ను మాత్రమే కేంద్రం ఆమోదిస్తోందని తెలిపారు. రాష్ట్రం సూచించిన హైబ్రిడ్ మోడల్ ప్రస్తుతం పథకంలో లేనందున, ఇంకా పరిశీలనలో ఉన్నదని చెప్పారు.ఈ సందర్భంగాఎంపీ డాక్టర్ కావ్య గారు మాట్లాడుతూ.. రాష్ట్రం తరపున మరిన్ని అంశాలు లేవనెత్తుతూ కేంద్రం రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విధానాల్లో మార్పులు చేయాలని అభ్యర్థించారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం తరపున 2,800 ఎలక్ట్రిక్ బస్సుల ప్రతిపాదన కోరారు. హైబ్రిడ్ GCC మోడల్ ద్వారా ఉపాధికి మద్దతు కల్పించాలన్నారు. CESL ఆధ్వర్యంలో బస్సుల కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
……………………………………..