SIGACHI CHEMICAL INDUSTRY
* పాశమైలారం ప్రమాదంపై ఆరా
* క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
* ఘటనాస్థలంలో మంత్రి దామోదర రాజనర్సింహ
* ప్రమాదంలో 15మంది కార్మికుల మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM REVANTH REDDY) విచారం వ్యక్తం చేశారు. ప్రదామానికి గల కారణాలను, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో 15 మంది కార్మికులు చనిపోయారు. ఇతర కార్మికులను కాపాడేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. సిగాచి రసాయన పరిశ్రమ(SIGACHI CHEMICAL INDUSTRY)లో జరిగిన పేలుడు సమయంలో 66 మంది కార్మికులు ఉన్నారు. అందులో 15 మంది మృతిచెందగా 36 మందికి గాయాలు అయ్యాయి. మంటలు ఇంకా ఎగసిపడుతున్నాయి. 11 శకటాలతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనాస్థలంలో శిథిలాలను తొలగిస్తున్నారు. శిథిలాల నుంచి ఒక కార్మికుడిని బయటకు తీశారు. సీఎం ఆదేశాలతో మంత్రి దామోదర రాజనర్సింహ (RAJANASIMHA) ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
——————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
