![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/01/download-49.jpg)
* తప్పించుకున్న వారి కోసం గాలింపు
ఆకేరు న్యూస్, డెస్క్ : ఛత్తీస్‌గఢ్ – ఒడిశా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. గరియాబంద్‌లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు (Moaists) మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ – ఒడిశా సరిహద్దు అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ (Search Operation)ప్రారంభించారు.
మావోయిస్టుల బృందం కనిపించడంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో శ్రీకాకుళం కోరాపుట్ డివిజన్ ఇన్చార్జి చలపతి(Chalapathi) సహా ఇప్పటి వరకు 14 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. చలపతి స్వస్థలం చిత్తూరుజిల్లా. ఈ ఘటనలో పోలీసులు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ (Telangana-Chathhisghar)సరిహద్దు అడవుల్లోనూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
……………………………………..