ఆకేరున్యూస్, శబరిమల: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో మండలపూజ, మకర విళక్కు వార్షిక పూజలు వైభవంగా ముగిశాయి. దీంతో ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు అధికారులు వెల్లడిరచారు. పందలం రాజకుటుంబ ప్రతినిధి త్రికేత్తనాల్ రాజరాజ వర్మ అయ్యప్ప దర్శనం చేసుకున్న తర్వాత ఆలయాన్ని మూసివేశామని పేర్కొన్నారు. ఈ సీజన్లో 53 లక్షల మందికిపైగా భక్తులు అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. రెండు నెలల పాటు జరిగే మండల-మకర విళక్కు వార్షిక పూజల కోసం నవంబర్ 15న అయ్యప్ప ఆలయాన్ని పూజారులు తెరిచారు. మండల పూజ అనంతరం డిసెంబర్ 26న గుడిని మూసివేశారు. 41 రోజులపాటు సాగిన పూజల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. మొత్తం 53 లక్షల మందికిపైగా భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు సమాచారం.
………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
