
ఆకేరున్యూస్, తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మై భారత్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మేర యువ భారత్ వరంగల్ (మై భారత్) వారి సౌజన్యంతో *తాడ్వాయి యువతరం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుక పురస్కరించుకొని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు ఆదివారం వ్యాస రచన పోటీ నిర్వహించారు .ఇందులో అత్యంత ప్రతిభ కన పరిచిన విద్యార్థులకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. మొదట డా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో బండారి అనిల్, ఆకుల సాంబయ్య, కేజీబీవీ ఉపాధ్యాయురాళ్లు అనిత, రాణి, తో పాటు వనవాసి ఆవాస ప్రముఖ్ ఆకుల సాంబయ్య ఇంటర్ విద్యార్థులు పాల్గొన్నారు పాల్గొన్నారు.
……………………………………………