* ఆధారాలు చూపినా.. సమాధానం ఏదీ..?
* మీడియాతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
ఎన్నికల సంఘాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షీ నాటరాజన్ గాంధీభవన్లో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘాన్ని బీజేపీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని తెలిపారు. ఓట్ చోరీతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధారాలతో చూపించినా.. ఈసీ నుండి సమాధానం లేదన్నారు. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తోందని ప్రజలు చూశారని.. వారి అంచనాలకు వ్యతిరేఖంగా బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తుల పేర్లతో వందలాది ఓట్లు ఉన్నాయని..వాటిని ఆధారాలతో చూపించినా ఈసీ స్పందించలేదన్నారు.
