
* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : రాష్ట్ర కమిటీలో అన్ని సామాజిక వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. 25 రోజుల్లో రాష్ట్ర కమిటీని ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.రాష్ట్ర కమిటీ పూర్తయిన తరువాత పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారిస్తుందన్నారు. ఇంత వరకు పార్టీ స్థానిక సంస్థలపై దృష్టి సారించలేదని ఇక ముందు స్థానిక ఎన్నికల్లో పట్టు సాధిస్తామని ఆయన తెలిపారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ కి సవాల్ వంటిదని రాంచందర్ రావు అన్నారు. పార్టీలో అందరూ కలిసికట్టుగా పని చేస్తున్నారని రాంచందర్ రావు తెలిపారు.
…………………………………….