* సర్వే సంస్థలన్నీ నరేంద్రమోది వైపే
* కాంగ్రెస్ మళ్ళీ అధికారానికి దూరం
* ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమికే పట్టం
* తెలంగాణలో కాంగ్రెస్ , బీజేపీ మద్య పోరు
* ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడి
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : ఎగ్జిట్ పోల్స్ ( Exit Polls )ఫలితాలు వచ్చేశాయి. మరోసారి కేంద్రంలో కమల వికాసమేనని తేల్చేశాయి. దాదాపు ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలన్నీ బీజేపీ నేతృత్వంలోని ఎన్ డీఏ ( NDA ) కూటమిదే అధికారం అని స్పష్టం చేశాయి. ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ పార్టీకి ఎదురుగాలి వీస్తోందని చెప్పాయి. తెలుగుదేశం కూటమిదే విజయం అని తేల్చేశాయి. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సంబందించి బీఆర్ ఎస్ ఒకటి లేదా రెండు సీట్లు రావడం కూడా గగనమేనని సర్వే సంస్థలు అంటున్నాయి. బీజేపీ కాంగ్రెస్ ల మద్యే హోరా – హోరీ పోటీ ఉండే అవకాశం ఉందంటున్నాయి.
మొత్తం 543 పార్లమెంటు స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి . శనివారంతో తుది దశ పోలింగ్ ముగిసింది. ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నేతలు మాత్రం ఫలితాల కోసం ఎదురు చూస్తూ టెన్షన్లో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు జూన్ 4 న వెలువడుతాయి. నేతలు ఎగ్జిట్ పోల్స్ తేల్చే ఫలితాల గురించి ఎదురు చూశారు. దేశంలోని వివిధ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువరించాయి.
దేశంలో కమల వికాసం ..
దేశ వ్యాప్తంగా నరేంద్ర మోది హవా మరోసారి కొనసాగింది. మూడో సారి ఎన్ డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ సంస్థలన్నీ తేల్చేశాయి.దాదాపు అన్ని సంస్థలు 350 కి పైగానే ఎన్డీఏ కైవసం చేసుకుంటుందని చెబుతున్నాయి.
న్యూస్ నేషన్ సర్వే ప్రకారం ..
——————————-
కూటమికి 342 నుంచి 378 వరకు సీట్లు గెలిచే అవకాశం ఉంది..
ఇండియా కూటమికి 153- 169
21 నుంచి 23 వరకు ఇతరులు గెలిచే అవకాశం ఉంది..
*రిపబ్లిక్ టీవీ – PMARQ
——————————-
NDA కూటమి కి – 359 సీట్లు
ఇండియా కూటమికి 154 సీట్లు ..
ఇతరులకు 30 సీట్లు
ఇండియా న్యూస్ – డీ డైనమిక్స్ సర్వే ప్రకారం
————————————
NDA కూటమికి- 371
ఇండియా కూటమికి – 125
ఇతరులు 47 మంది గెలుస్తారని తేల్చింది..
దాదాపు ఇదే స్థాయిలో అన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు సీట్ల లెక్కలను చెప్పాయి.
ఆంధ్రప్రదేశ్ లో బాబు హవా
——————————-
ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా NDA కూటమి కే సర్వే సంస్థ లు జై కొట్టాయి . ఐ- ప్యాక్ సర్వే ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో మరోసారి తామే అధికారంలోకి వస్తామన్న ధీమాలో వైయస్ జగన్ ఉన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీకూడా కూటమిలో కలవడంతో విజయం తథ్యమని తెలుగుదేశం కూటమి భావిస్తోంది.
* పీపుల్స్ పల్స్ సంస్థ ప్రకారం
———————-
* టీడీపీ కూటమికి 111 నుండి 135 సీట్లు
* YSRC కి 45 నుండి 60 సీట్లు వస్తాయని తేల్చింది..
* పయనీర్ సర్వే ప్రకారం
—————————
* . టీడీపీ 144 -సీట్లు .
* వైఎస్ఆర్ పార్టీ 31 స్థానాల్లో గెలుస్తుంది ..
ఇదే విదంగా దాదాపు అన్ని సంస్థలు తెలుగు దేశం కూటమి వేపే మొగ్గు జూపాయి ..
* తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
ఇక తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి
బీజేపీ – కాంగ్రెస్ మద్య పోటీ ఉంటుందని సర్వే సంస్థ లు తేల్చాయి..
న్యూస్ 18 సర్వే ప్రకారం..
——————————
బీజేపీ 7 నుండి 10 సీట్లు …
కాంగ్రెస్ పార్టీ 5- 8 స్థానాల్లో ..
బీఆర్ఎస్ 2 నుండి 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది..
ఇండియా టీవీ ..సీఎన్ ఎక్స్ సర్వే ప్రకారం ..
———————————————
కాంగ్రెస్ పార్టీ 6 నుండి 8 సీట్లు
గెలుస్తుంది..
బీజేపీ 8 నుండి 10 సీట్లు ,
బీఆర్ఎస్ ..ఒకటి..
ఎంఐ ఎం – ఒక సీటు గెలుస్తుంది..
ఇక ఆరా మస్తాన్ సర్వే ప్రకారం…
——————————-
బీజేపీ 8 నుండి 9 సీట్లు ,
కాంగ్రెస్ పార్టీ 7 నుండి 8 సీట్లల్లో విజయం సాధిస్తాయి..
చాణక్య ఎక్స్ సంస్థ సర్వే ప్రకారం
——————————-
కాంగ్రెస్ పార్టీ 9 నుండి 11 సీట్లు,
బీజేపీ 4 నుండి 6 సీట్లు గెలుస్తాయి..
బీఆర్ఎస్ – 1 సీటు ,
ఎంఐఎం 1 సీటు గెలుస్తాయి …
రివర్స్ అయ్యే అవకాశం ఉందా,..?
: ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాల అంచనాలు రివర్స్ అయిన సంధర్భాలు కూడా ఉన్నాయి..
తెలంగాణ, చత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కు సంబంధించి సర్వే సంస్థల అంచనాలు తారుమారయినాయి..ఈ నెల 4 వ తేదీన వెలువడే ఫలితాలకు దగ్గరగా ఉంటాయా లేదా అన్నది వేచి చూడాల్సిందే ..
——————————————————