
* కేటీఆర్ పై మంత్రి సీతక్క సీరియస్
ఆకేరు న్యూస్ ములుగు ః ఆదివాసి అడవి బిడ్డల జోలికొస్తే సర్వ నాశనం అయిపోతావు కేటీఆర్ అంటూ మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. మంగళవారం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను ఆదివాసి మహిళ అని కావాలనే నాపై అసత్య ఆరోపణలు చేస్తూ రాజకీయ దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఆదివాసి కోయ వర్గానికి మంత్రి పదవి లభించిందని అదే తనకు ఓ బాధ్యతగా భావించి ములుగు అభివృద్ధికి కృషి చేస్తున్నానని సీతక్క తెలిపారు . ప్రజలే నా బలం తాను ఎలాంటి తప్పు చేసినా అసెంబ్లీలో చర్చ పెట్టి నిలదీయాలని సీతక్క సవాల్ చేశారు. పక్క నియోజకవర్గాల నుంచి జనాలను తీసుకొచ్చి రోడ్లమీద పోరాటాలు చేస్తే ప్రజలు సహించరని అన్నారు . రాష్ట్రవ్యాప్తంగా తాను చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నీచ రాజకీయాలకు ప్రజల సమాధానం చెబుతారు అని అన్నారు. ఎవరికీ భయపడేదిలేని లేదని తన బలం ములుగు జిల్లా ప్రజలేలని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ల ఆశీస్సులు తనకు ఉన్నాయని నియోజక అభివృద్ధికి సర్వదా కృషి చేస్తానని మంత్రి సీతక్క వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాను రవిచందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వేద కళ్యాణి తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు.
………………………………………………..