
* యాదగిరిగుట్టలో దుర్ఘటన
ఆకేరు న్యూస్, యాదరిగిగుట్ట : యాదగిరిగుట్టలోని ఓ కంపెనీలో పేలుడు సంభవించింది. ఓ కార్మికుడు అక్కడికక్కడే దుర్మరణం చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. పేలుడు ధాటికి కంపెనీలోని సామగ్రి చెల్లాచెదురైంది. యాదగిరిగుట్ట (Yadagirigutta) మండలం పెద్దకందుకూరులో ఈ దుర్ఘటన జరిగింది. అధికారులు, కార్మికుల కథనం ప్రకారం.. పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో మంగళవారం ఉదయం ఎక్స్‌ప్లోజివ్ ప్లాంట్ బయట బాయిలర్ స్టీమ్ పైపు తెరుస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈఘటనలో కార్మికుడు సదానందం (50) అక్కడికక్కడే మరణించారు. ప్రతీ రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం బాయిలర్ స్టీమ్‌ను మరో ప్లాంటుకు మళ్లించే క్రమంలో స్టీమ్‌కు సంబంధించిన మూతను విప్పుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అక్కడ వీధుల్లో ఉన్న సదానందం అనే కార్మికుడు తలకు తీవ్రంగా గాయం కావడం అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి స్వస్థలం గోదావరిఖని. 25 ఏళ్లుగా అదే కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నారు. అధికారులు కంపెనీని సందర్శించి ప్రమాద తీవ్రతను అంచనా వేస్తున్నారు.
…………………………………