* రియాక్టర్ పేలి చెలరేగిన మంటలు
ఆకేరు న్యూస్, సంగారెడ్డి: భారీ పేలుడుకు సంగారెడ్డి జిల్లాలోని (SANGAREDDY) పారిశ్రామికవాడ ఉలిక్కిపడింది. గురువారం ఉదయం ఓ పరిశ్రమలో రియాక్టర్ పేలడం(REACTOR BLOST)తో అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని జిన్నారం మండలం కాజీపల్లి పారిశ్రామికవాడ(KAZIPALLI INDUSTRIAL AREA)లోని అరోరా లైఫ్‌సైన్స్ పరిశ్రమలో ఈ ఘటన జరిగింది. ఎంబీ-2 బ్లాక్‌లోని రియాక్టర్లలో సాల్వెంట్ మిక్సింగ్ జరుగుతుండగా పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. కార్మికులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అందుపులోకి తీసుకొచ్చారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
…………………………………………..