* జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం
ఆకేరు న్యూస్, భూపాలపల్లి జిల్లా : అప్పులు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు. జయశంకర్ భూపాలపల్లి (Jayasankar Bhupalpally) జిల్లా గోరి కొత్తపల్లి మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన బుల్లవేణి రాజయ్య (59) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇటీవల కాలంలో వరుసగా పంట నష్టం రావడంతో అప్పుల పాలయ్యారు. అప్పులోళ్ల ఒత్తిడి ఎక్కువై, తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఆదివారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెండు రోజులుగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మరణించారు. వేసిన పంటలు ఎండిపోవడంతోపాటు సరైన గిట్టుబాటు ధర లేక అప్పులు పెరిగిపోయయని, ఎలా తీర్చాలనే మనోవేదనతో పురుగుల మందు తాగాడని రాజయ్య బంధువులు వెల్లడించారు. మృతునికి భార్యా, కొడుకు, కుమార్తె ఉన్నారు.
…………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
