
* యూరియా కోసం పడిగాపులు
ఆకేరున్యూస్ మహబూబాబాద్ ః వ్యవసాయ సీజన్ ఊపందుకోవడంతో రైతులకు యూరియా
అవసరం ఎక్కువైంది. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి రైతులు యూరియా కోసం నానా తిప్పలు పడుతున్నారు. మండుటెండలో యూరియా బస్తాల కోసం బారులు తీరి నిల్చుంటున్నారు. వారం రోజులు గడుస్తున్నా రైతులకు యూరియా దొరకని పరిస్థితి నెలకొంది. తిండి లేక తిప్పలు లేక యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరువై ముప్పై ఊర్లకు కలిపి ఒకే చోట యూరియా పంపిణీ చేస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం అర్దరాత్రి లేచి 30 లేదా 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా యూరియా కోసం పడిగాపులు పడడానికే సరిపోతుందంటున్నారు. దీంతో వ్యవసాయ పనులతో పాటు ఇతర పనులు కుంటుపడి పోతున్నాయని ఆవేదన వ్యకక్తం చేస్తున్నారు. క్యూలైన్లలో నుంచి ఎటైనా పోవాలంటే చెప్పులు..ఖాలీ బస్తాలు..అధార్ కార్డులు పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
…………………………………………….