
* కె.ఎన్.బయో సైన్స్ ఆయిల్ ఫామ్ నర్సరీ పరిశీలించి జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు: ఫామాయిల్ పంట సాగుతో రైతులు పెట్టుబడి తక్కువ పెట్టి ఎక్కువ ఆదాయం పొందవచ్చంటు రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సూచించారు. బుదవారం వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ సమీపంలోని కె.ఎన్. బయోసైన్స్ ఆయిల్ ఫామ్ నర్సరీని కలెక్టర్ సందర్శించారు. కలెక్టర్ నర్సరీ విస్తీర్ణం ఎన్ని ఎకరాలు ,నర్సరీలో ఎన్ని మొక్కలు పెంచారు,ఎన్ని నాటుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి, ఈ సంవత్సరం రైతులకు నాణ్యమైన మొక్కలు ఉన్నాయా ,తదితర విషయాలపై జిల్లా ఉద్యాన అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది రైతులకు నర్సరీలో 1,17,000 మొక్కలు అందుబాటులో ఉన్నాయని ,ఒక మొక్క 1.2 మీటర్ ఎత్తులో, 12 ఆకులు కలిగి నాణ్యమైన మొక్కలు అందుబాటులో ఉన్నాయని ఉద్యాన అధికారి దండు సంజీవరావు వివరించారు. రైతులకు అవగాహన కల్పించి ఎక్కువ ఎకరాల్లో నాటించాలని ఉద్యాన వనా శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నర్సరీ నిబంధనల మేరకు నాణ్యమైన మొక్కలను రైతులకు సకాలంలో అందించాలని,అన్ని రికార్డులు సిద్ధంగా ఉంచాలని నర్సరీ ఇంచార్జీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నర్సరీ ఇంచార్జీ ఉద్యాన అధికారి జే. శ్రీకాంత్, నర్సరీ నిర్వాహకుడు కర్ణాకర్, ములుగు, వెంకటాపూర్ ఆయిల్ ఫామ్ కంపెనీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ నవీన్ నాయక్, జైన్ డ్రిప్ కంపెనీ ప్రతినిధి ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………