* మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి
ఆకేరు న్యూస్, ములుగు: రైతులు పండించిన వరి ధాన్యాన్ని నేరుగా మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని ములుగు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి సూచించారు. సోమవారం ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం కాల్వపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతన్నలు సద్వినియోగపరుచుకోవాలని, దళారులకు ధాన్యాన్ని విక్రయించకుండా ప్రభుత్వానికి ధాన్యాన్ని విక్రయించాలని, ప్రభుత్వం సేవలను రైతన్నలు వినియోగించుకోవాలని కోరారు. ఈ ఖరీఫ్ సీజనుకు రైతుల ఖాతాల్లో ధాన్యం కొనుగోళ్ల డబ్బులు సకాలంలో జమ చేసే విధంగా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు .కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతన్నల పార్టీ అని, రైతన్న సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని, ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే అధికారులకు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అధికారులు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రతి రోజు తనిఖీ చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉండే చిన్న, చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. రబీ సీజన్ యందు గల సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ కూడా రైతన్న ఖాతాల్లో జమ చేస్తుందని. రైతులెవరూ దళారుల చేతిలో మోసపోవద్దు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజ్ కుమార్, ఏపీఎం కిషన్, సీసీ మల్లు చారి, మాజీ సహకార సంఘ పాలకవర్గ సభ్యులు యాషాడపు మల్లయ్య, సుధాకర్ లతో పాటుగా తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా, మండల, గ్రామ నాయకులు మరియు మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………
