* కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో 46 దరఖాస్తులు రాగా అత్యధికంగా గృహ నిర్మాణ శాఖకు 13, భూ సమస్యలు 08, పెన్షన్ 05, ఇతర ఇతర శాఖలకు సంబంధించినవి 20 దరఖాస్తులు స్వీకరించగా వాటిని వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, వివిధ జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి, పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
