* ఆమెకు అన్యాయం చేయవద్దు : రైతు సంఘాలు
* నేను ఉద్యోగం ఇస్తా : బాలీవుడ్ డైరెక్టర్
ఆకేరు న్యూస్ డెస్క్ : బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut)ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ (Kulwinder Kaur) .. వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. చండీగఢ్ (Chandigarh) విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. విధుల నుంచి తొలగించారు. అయితే.. కుల్విందర్ కౌర్ కు పలువురు మద్దతు తెలుపుతున్నారు. కేంద్రం తెచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన చేసిన రైతులపై గతంలో కంగన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఆమెపై చేయు చేసుకున్నట్లు కుల్విందర్ కౌర్ పేర్కొంది. రూ.100 కోసమే కూర్చొని రైతులు ఆందోళన చేస్తున్నారంటూ గతంలో కంగన అవమానించడంతోనే ఇలా చేశానని వెల్లడించింది. దీంతో కుల్విందర్ కౌర్‌కు సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా వంటి పలు రైతు సంఘాలు (Farmers Unions) మద్దతు ప్రకటించాయి. కుల్వీందర్‌కు అన్యాయం చేయొద్దని.. ఘటనపై సరైన విచారణ జరపాలంటూ పంజాబ్ డీజీపీని కలసి కోరతామని ఆ సంఘాల నేతలు సర్వణ్ సింగ్ పందేర్, జగ్జిత్ సింగ్ దల్లేవాల్ మీడియాకు వెల్లడించారు. ఇదే డిమాండ్‌తో ఈనెల 9వ తేదీన మొహాలీలోని ఎస్పీ కార్యాలయానికి ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. అలాగే.. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లా (Vishal Dadlani)నీ కూడా ఆమెకు అండగా నిలిచారు. ఆమె ఒప్పుకుంటే తగిన ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.
————————