
* ఆ విషయంలో నా తండ్రి చాలాసార్లు వాపోయారు
* సిగాచి కంపెనీపై మృతుడి కొడుకు ఫిర్యాదు
* కంపెనీపై కేసు నమోదు చేసిన పోలీసులు
ఆకేరు న్యూస్, పఠాన్ చెరు : బీడీఎల్ పోలీస్ స్టేషన్లో సిగాచి కంపెనీ((Sigachi Company) పై కేసు నమోదైంది. పాత మిషనరీ వాడడం వల్లే కంపెనీలో ప్రమాదం జరిగిందని ఓ యువకుడు, మృతుడి కుమారుడు సాయి యశ్వంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కంపెనీలో పాత మిషనరీ వాడుతున్నట్లు తన తండ్రి చాలాసార్లు తనకు చెప్పారని యశ్వంత్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పఠాన్‌చెరు మండలంలోని పాశమైలారం (Pasamylaram) సిగాచి కంపెనీలో జూన్ 30వ తేదీన భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 36 మంది కార్మికులు మృతి చెందారు. కార్మికులు చనిపోవడంతో సిగాచి కంపెనీ మేనేజ్మెంట్పై కేసు నమోదైంది. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే 36 మంది కార్మికులు మరణించారని బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. బీఎన్ఎస్ 105, 110,117 సెక్షన్ల కింద బీడీఎల్ భానూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యశ్వంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
…………………………………………….