* ప్రజాభవన్లో సమావేశం మొదలు
* కార్పొరేషన్లు, మున్సిపల్, పంచాయితీ ప్రతినిధులతో భేటీ
* నిధులు, విధులపై చర్చ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో 16వ ఆర్థిక సంఘం(16TH FINANCE COMMISSION) ప్రతినిధులు పర్యటిస్తున్నారు. నిన్న సాయంత్రమే తెలంగాణకు వచ్చిన సభ్యులు ఉదయమే ప్రజాభవన్(PRAJABHAVAN)కు చేరుకున్నారు. కార్పొరేషన్లు, మున్సిపల్, పంచాయతీ శాఖ ప్రతినిధులతో భేటీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు కమిషన్ కేటాయించిన నిధులు, వాటి వినియోగంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సర్పంచ్ల పదవీ కాలం ముగిసి ఇప్పటికే ఏడెనిమిది నెలలు అవుతోంది. ఈ మధ్య కాలంలో ఇప్పటి వరకు ఫైనాన్స్ కమిషన్ నిధులను ఎంత వరకు వెచ్చించారు, వేటికి వెచ్చించారు అనేది ఆరా తీస్తున్నారు. రెండు రోజుల పాటు 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు తెలంగాణలో ఉండనున్నారు. వ్యాపారులు, పరిశ్రమల ప్రతినిధులతో కూడా సమావేశం కానున్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(REVANTH REDDY), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(BHATTI VIKRAMARKA)తో కూడా సమావేశం కానున్నారు. 16వ ఆర్థిక కమిషన్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చజరిగే అవకాశం ఉంది.
——————————