Published:
Updated: 09 Sep 2024 • 12:01 PM
ఆకేరు న్యూస్, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా షాద్నగర్(RANGAREDDY DISTRICT SHADNAGAR) పట్టణ శివారులో విషాదం చోటుసుకుంది. ఆదివారం అర్దరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదం(ROAD ACCIDENT)లో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఫరూక్ నగర్ మండల పరిధిలోని ఎలికట్ట గ్రామ శివారులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బైక్పై వేగంగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టారు. దీంతో వారిరువురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
——————
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
