
ఆకేరు న్యూస్, ములుగు:ఇటీవల ములుగు జిల్లా గోవిందరావుపెట మండలం చల్వాయి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు చుక్క రమేష్ ఆత్మ హత్య చేసుకొని మృతి చెందారు.ఆయన కుటుంబానికి బిఆర్ ఎస్ నాయకులు లక్ష రూపాయల నగదు ఆర్థిక సహాయం అందుజేశారు.మొదట చుక్క రమేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి ,మాజీ రెడ్కో చైర్మన్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి లు మాట్లాడుతూ రమేష్ కుంటుంబానికి అన్నివేళలా అండగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి , ఏటూరునాగారం మండల పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్,జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు, ఎండి ఖాజా పాషా, తాడూరి రఘు, ఈసం రామ్మూర్తి, మాధరి రామయ్య, కుమ్మరి చంద్రబాబు , జాడి బోజారావు, గండేపల్లి నర్సయ్య, కాళ్ల రామకృష్ణ, ఎర్రల సారయ్య, నాగసాగర్, ఎండి ఖలీల్, ఎండి ముస్తఫా, వావిలాల పోశయ్య, దేపాక శ్రీరామ్, వావిలాల ముత్తయ్య, భాస రవి, బిక్షపతి, చిన్నికృష్ణ, గోవిందరావుపేట మండల పార్టీ అధ్యక్షులు నరసింహ నాయక్, గోవిందరావుపేట ఎంపీపీ మాజీ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
………………………………………………………………..