
*వెల్డింగ్ దుకాణంలో చెలరేగిన మంటలు
ఆకేరున్యూస్ హైదరాబాద్ ః హైదరాబాద్లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్
జబీల్ గూడ లోని సాయిగణేష్ నగర్ కాలనీలోని ఓ వెల్డింగ్ దుకాణంలో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం వెల్డింగ్ షాప్లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి, వెల్డింగ్ షాప్లో వచ్చిన మంటలు పక్క దుకాణాలకు కూడా వ్యాపించడంతో మంటలు ఎక్కువయ్యాయి దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.మొన్న మైలారంలోని సిగాచి రసాయనాల ఫ్యాక్టరీలో జరిగిన సంఘటన మరిచిపోకముందే ఇలా మరో అగ్ని ప్రమాదం జరగడం స్థానికులను కలవర పరిచింది. ఈ అగ్రిప్రమాదం షార్ట్ సర్క్యూట్ తో జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఉదయం వేళ కావడంతో వ్యాపార కార్యకలాపాలు ఇంకా మొదలు కాకముందే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతం మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిదిలోకి వస్తుంది. అగ్రి ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై మీర్పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
…………………………………………..