* అరుదైన ఘనత సాధించిన ‘టైగర్ నాగేశ్వరరావు’
ఆకేరు న్యూస్ డెస్క్ : నచ్చిన హీరో సినిమా థియేటర్లోనో, టీవీలోనో వస్తుందంటే అతుక్కుపోయి చూస్తుంటారు. సన్నివేశం నచ్చితే చప్పట్లు, విజిల్స్ తో సందడి చేస్తారు. ఇది చాలా మంది సినీ అభిమానులు చేసేది. మరి.., అందరిలా వినలేని, మాట్లాడలేని వారు అలాంటి సినిమాలను చూసి ఎలా ఎంజాయ్ చేయగలరు, వారు సినిమా చూసినా డైలాగులను వినలేరు.. అర్థం చేసుకోలేరు.. మరి ఎలా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా ‘టైగర్ నాగేశ్వరరావు’ అరుదైన ఘనత సాధించారు. సైన్ ల్వాంగేజ్‌లో ఈ మూవీని ఓటీటీలో అందుబాటులోకి తీసుకువచ్చారు. భారతీయ సినీ చరిత్రలో సైన్ లాంగ్వేజ్‌లో ఓటీటీలో విడుదలైన మొదటి సినిమా టైగర్ నాగేశ్వరరావు రికార్డులకు ఎక్కింది. ఈ చిత్రంలోని పాటలు, సౌండ్ లాంటివి వినలేకపోవచ్చు కానీ.. కథేంటి? డైలాగ్స్ ఏంటి అనేవి దివ్యాంగులకు కూడా తెలుస్తాయి. ఈ చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ లు హీరోయిన్లుగా నటించగా రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ కీలక పాత్రలను పోషించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ మూవీని నిర్మించగా జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. గతేడాది దసరా కానుకగా ఈ చిత్రం ప్రేకకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ మూవీ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
——