బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని సీసీబీకి హేమ లేఖ రాశారు.
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసులకు తెలుగు నటి హేమ మరో ట్విస్ట్ ఇచ్చింది. ఈరోజు విచారణకు హాజరుకాలేదు. ఈ కేసును పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. పార్టీ నిర్వాహకుడు, ప్రధాన నిందితుడు వాసు ఖాతాలో పెద్దమొత్తంలో నగదు ఉన్నట్లు గుర్తించారు. ఆ నగదు ఎలా వచ్చిందో ఆరా తీస్తున్నారు. రేవ్ పార్టీలో 103మంది పాల్గొనగా… వారిలో 86మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వారిలో నటి హేమతో కలిపి 8మందిని నేడు విచారణకు రావాలని సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే, విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని.. ప్రస్తుతం తాను వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్టు బెంగళూరు సీసీబీకి హేమ లేఖ రాశారు. అయితే… హేమ లేఖను పరిగణలోకి తీసుకోనట్టు తెలుస్తుంది. కాగా… హేమకు మరో నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు సీసీబీ పోలీసులు. మరోవైపు.. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టేందుకు కోర్టులో ఇవాళ పోలీసులు పిటిషన్ వేశారు.
—————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
