
* పట్టుకున్నోళ్లకు పట్టుకున్నన్ని చేపలు
భద్రాద్రి కొత్తగూడెం, ఆకేరున్యూస్: పల్లెల్లో కనిపిస్తున్న దృశ్యాలు చెరువుల జాతర తలపిస్తోంది.. చెరువుల్లో నీరు అడుగంటుతుండటంతో చేపలు పట్టేందుకు జనం ఎగబడుతున్నారు. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని కర్ణవల్లి పెద్ద చెరువులో చేపల వేటకు జనం ఎగబడ్డారు. చెరువుల్లో చేపలు పట్టే ముందు చుట్టుపక్కల గ్రామాలకు విషయం తెలియజేసి అందరు ఒకేసారి చెరువుల్లో చేపలు పట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే కర్ణవల్లిలోని పెద్ద చెరువులో చేపలు పట్టేందుకు జనం భారీగా తరలివచ్చారు. సుమారు ఐదు ఊర్ల జనం ఒక్కసారిగా చెరువులో దిగడంతో ఆ ప్రాంతం జాతరను తలపించింది. జల పుష్పాల కోసం జనం పోటీ పడ్డారు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా జనం చేపలు పట్టేందుకు ఎగబడడం చేపల జాతరను తలపించింది..
………………………….