* మేం అధికారంలోకి వస్తాం.. 400 ఎకరాల్లో అతిపెద్ద ఎకోపార్క్ ఏర్పాటు చేస్తాం
* హెచ్‌సీయూ భూములపై కేటీఆర్ కీలక ప్రకటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రేవంత్‌రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి.. రేవంత్‌రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఎవరైనా హెచ్‌సీయూ (HCU) భూములు కొనకండి. ఒక ఇంచు కొనుగోలు చేసినా తిరిగి వెనక్కి తీసుకుంటామని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మూడేళ్లలో అధికారంలోకి వస్తామని, 400 ఎకరాల ఆ భూమిలో అతిపెద్ద ఎకో పార్కు ఏర్పాటు చేసి విద్యార్థులకు, హైదరాబాద్ ప్రజలకు కానుకగా ఇస్తామని అన్నారు. తెలంగాణ భవన్(TELANGANA BHAVAN)లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించారు. కాంగ్రెస్‌కు ఒక్క సీట్ ఇవ్వకుండా గెలిపించారు. 400 ఎకరాలను పొరపాటున ఎవరూ కొనవద్దు. కొంటే నష్టపోతారు. తర్వాత తప్పు పట్టొద్దు. ప్రభుత్వంలోకి వచ్చాక కాదు.. మూడేళ్ల ముందుగానే చెబుతున్నాం. ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ విస్తరణ కాంక్షతో పని చేస్తుంది. మేం మాత్రం భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నాం. వచ్చే తరాల కోసం ఆలోచించాలని మా నేత కేసీఆర్ (KCR) చెప్పారు. మొన్నటి వరకు ఆ జాగ కోర్టులో ఉంది. ప్రైవేటు వ్యక్తులది కాదు.. ప్రభుత్వానిది కాదని కొట్లాడం. దాంతోనే ఆ ల్యాండ్ ప్రజలకు వచ్చింది. మేం కొట్లాడింది రియల్ ఎస్టేట్ కోసం కాదు కొట్లాడింది. ఆ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ జరగాలి.. ఢిల్లీ మాదిరిగా మన నగరం మారొద్దు.. గాలి కాలుష్యంతో మాస్క్‌లు వేసుకొని తిరిగి పరిస్థితి ఢిల్లీలో ఉన్నది. ఆ పరిస్థితి హైదరాబాద్‌కు రావొద్దని.. భవిష్యత్ తరాలు బాగుండాలంటే.. 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూములను ఎకో పార్క్‌గా మారుస్తాం’ అని కేటీఆర్ (KTR)స్పష్టం చేశారు.
…………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
