Free Fish Seed Distribution
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
ఉచిత చేపపిల్లల పంపిణీకి రూ.116 కోట్లు నిధులు కేటాయించిన ప్రజా ప్రభుత్వానికి మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్న పెండ్యాలలో సోమవారం ఏర్పాటుచేసిన మత్స్యకారుల సహకార సంఘం సమావేశంలో మత్స్యశాఖ జిల్లా అధ్యక్షులు నీల రాజు మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మత్స్యకారుల అనుకూల ప్రభుత్వమని నిరూపించింది అన్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం విశేషమైన కృషి చేసిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి శ్రీహరి కృషితో నిధులు మంజూరు కావడంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు. చేప పిల్లల పంపిణీ కోసం తమ వంతు పాత్ర పోషించిన రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధ్యక్షులు నీల రాజు, నగేష్, ఈర్ల రాజు ఉపేందర్, పుప్పాల రవి, శాగ రవి, తంగెళ్లపల్లి రాజయ్య, ముంబై శీను, ఎస్ కే ఎస్ తదితరులు ఉన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
