
ఆకేరు న్యూస్, ములుగు:పోలీసులు సీఆర్పిఎఫ్ బలగాలు సంయుక్తంగా అమలు చేస్తున్న పోరు కన్నా- ఊరు మిన్న అనే కార్యక్రమంలో భాగంగా సోమవారం ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శబరీష్ ఎదుట సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులులొంగిపోయారు. ఇందులో ఒకరు ఏరియా కమిటీ సభ్యుడు( ఏసీఎమ్) హోదాలో ఉండగా మిగతా నలుగురు మావోయిస్టు పార్టీ కార్యకర్తలుగా పనిచేశారు. వీరందరు చత్తిస్ ఘడ్ రాష్ట్రంలోని సుక్మా, బీజాపూర్ జిల్లాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు.ఇందు లో శ్యామల రాజేష్ ఆలియాస్ ఐతు(22), కడతి ఇడుమా అలియాస్ సుక్క(20), ఊకే జోగి(18), బాడిచే బీమా ఆలియస్ మహేష్(21), ముచిక జోగీలు(16) లొంగిపోయారు. వీరికి పోలీసులు ఒక్కొక్కరికి 25వేల చొప్పున నగదును అందించారు. లొంగిపోయిన వారి హోదాల ప్రకారం ఆరు లక్షల 75 వేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నామని ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మావోయిస్టు భావజాలం మానుకోవాలని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ పునరావాస పథకాలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతోపాటు ఏటూర్ నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ డిఎస్పి రవీందర్ తదితరులు ఉన్నారు.
……………………………………………