
* ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సమరభేరి
* స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ సన్నాహాలు
* ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే
ఆకేరు న్యూస్ హైదరాబాద్ ః కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు ప్రారంభించినట్లుంది. అందులో భాగంగానే శుక్రవారం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మళ్లిఖార్జున ఖర్గే హాజరుకానున్నారు. గురువారం రోజే ఖర్గే హైదరాబాద్ చేరుకున్నారు. గురువారం హైదరాబాద్ చేరుకున్న ఖర్గేకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తదితరులు స్వాగతం పలికారు. జైయ బాపూ..జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సభకు గ్రామశాఖ అధ్యక్షులు,అన్ని జిల్లాల మండల కమిటీ కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 500 మందికి తక్కువకాకుండా ఈఈ సభకుల ఆహ్వానించారు.వారితో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులందరూ హాజరుకానున్నారు.ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,కార్పొరేషన్ల చైర్మన్లు అందరూ కలిసి దాదాపు 50 వేల మంది ఈ సభకు హాజరుకానున్నారు.
ముందుగా గాంధీ భవన్లో మీటింగ్
సమరభేరి కంటే ముందు ఉదయం గాంధీభవన్లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ,రాజకీయ అడ్వైజరీ కమిటీ సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఖర్గే హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రానున్న లోకల్ బాడీ ఎన్నికలకు గురించి చర్చించే అవకాశం ఉంది,ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ దిశగా పార్టీ కేడర్ ను సిద్ధం చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగానే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుంగా జుబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ ఎస్ నుంచి ఈ సీటును కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ ఎస్ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గాందీ భవన్లో మీటింగ్ అయిన అనంతరం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో సమర భేరి ఉంటుంది. ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మళ్లిఖార్జున్ ఖర్గే,సీఎం రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,పిసిసి ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ప్రసంగిస్తారు. గ్రామ స్థాయి నాయకత్వానికి సభలో మాట్లాడేందుకు అవకాశం ఇస్తారని భావిస్తున్నారు.
ఖర్గేను కలిసిన అసంతృప్తి ఎమ్మెల్యేలు
మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం వస్తుందని భావించి నిరాశకు గురైన అసంతృప్తి ఎమ్మెల్యే
ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గేను కలిసి తమ కు తగిన గుర్తింపు లభించడంలేదని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఖర్గేను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి,మల్ రెడ్డి రంగారెడ్డి,రాంమోహన్ రెడ్డి, బాలూనాయక్,ప్రేమ్ సాగర్ రావు తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా సామాజిక సమీకరణాల నేసధ్యంలోనే మంత్రి వర్గ విస్తరణ జరిగిందని.. కష్ట పడ్డ వారందరికీ సరైన సమయంలో సరైన అవకాశం తప్పకుండా లభిస్తుందని ఖర్గే వారికి నచ్చజెప్పినట్లు సమాచారం .
……………………………………………………..