* రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చారు..
* పాలుమూరు ప్రాజెక్టులు పూర్తి చేయలే
* అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) వాడివేడిగా జరుగుతున్నాయి. ఈరోజంతా మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) వర్సెస్ అధికార పక్షం (Ruling party) అన్నట్లుగానే సమావేశాలు కొనసాగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy), మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Ministers Komati Reddy Venkat Reddy), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Duddilla Sridhar Babu), సీతక్క (Sitakka), భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అందరూ హరీశ్‌రావు (Harish Rao) వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చారు. అసెంబ్లీలో బడ్జెట్ (Budjet) పై చర్చ సందర్భంగా వారిమధ్య వాదోపవాదాలు జరిగాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా బీఆర్ఎస్(BRS) నేతల్లో మార్పు రావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పెండింగ్ పడడానికి గత బీఆర్ఎస్ పాలనే కారణమన్నారు. రంగారెడ్డి జిల్లాలో భూములన్నీ అమ్ముకున్నారని.. కానీ నీళ్లు మాత్రం ఇవ్వలేదన్నారు. పదేళ్లలో పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు. రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) ను ఎడారిగా మార్చాలని చూసింది బీఆర్ఎస్ నాయకత్వమే అని ఆరోపించారు.
ఆ పథకాలపై విచారణకు సిద్ధమా?
బీఆర్ఎస్(BRS) నేతలు గొప్పగా చెప్తున్న మూడు పథకాలపై విచారణకు సిద్ధమా అని సీఎం (CM) సవాల్ విసిరారు. బీఆర్ఎస్ సర్కార్ (BRS Governament) హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని, రూ.లక్షల కోట్ల విలువైన ఓఆర్ఆర్ను రూ.7 వేల కోట్లకు అమ్మారని, బతుకమ్మ చీరలు అని చెప్పి సూరత్ నుంచి కిలోల లెక్క తీసుకువచ్చి పంపిణీ చేశారని రేవంత్ (Revanth) అన్నారు. ఆ పథకాలపై విచారణకు సిద్ధమా అని ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. అంతకుముందు శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. రూ. 4.5 లక్షలు లేని జీఎస్డీపీని.. రూ.14 లక్షలకు తీసుకెళ్లింది బీఆర్ఎస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. రూ.200 పింఛన్‌ను రూ.2 వేలకు పెంచినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పాలన బాగా లేదని మాటలు చెబితే సరిపోతుందని, అందుకు ఆధారాలు చూపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అలాగే.. బడ్జెట్లో భూముల అమ్మకం ద్వారా 12వేల కోట్ల రూపాయలు సమీకరిస్తామని భట్టి పేర్కొన్నారని, అది ద్వంద్వనీతి కాదా అని ప్రశ్నించారు.
————————-