పార్టీ మారాలని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను డీఎస్పీలతో బెదిరిస్తున్నారు.. మీడియాతో కేటీఆర్
* మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ మారకపోతే ప్రాణ గండం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను డీఎస్పీలతో బెదిరిస్తున్నారని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో దుర్మార్గమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒక ఇద్దరు ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాల్లో ఉన్న డీఎస్సీలు ఫోన్ చేసి పార్టీ మారండి.. లేదంటే ప్రాణగండం ఉందని బెదిరించారు. ఇంకా కొందరిని బెదిరింపులకు గురి చేస్తున్నారు. బీజేపీని వాషింగ్ మిషన్ పార్టీగా విమర్శించిన కాంగ్రెస్ అదే పనిని తెలంగాణలో చేస్తోంది… అని ఆరోపించారు. బడే భాయ్ – చోటే భాయ్‌కి తేడా ఏం లేదు. ఢిల్లీలో బడే భాయ్ నరేంద్ర మోడీ (Narendra Modi) రాజ్యాంగబద్ధ సంస్థలను ఉపయోగించుకున్నట్లుగానే… ఇక్కడ చోటే భాయ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వ విభాగాలను ఉపయోగించుకుని మా ఎమ్మెల్యేలను బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధిచెబుతారని తెలిపారు.
———————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
