బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తున్న సహ ఉద్యోగులు
* బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
ఆకేరు న్యూస్ , కమలాపూర్ : కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామానికి చెందిన మొండెద్దుల శ్రీకాంత్(23) బ్లడ్ క్యాన్సర్ తో ఇటీవల మరణించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీకాంత్ జియో కంపెనీలో కాంట్రాక్టు టెక్నీషియన్ గా పని చేస్తుండేవాడు. చేతికందిన కొడుకు దురదృష్టవశాత్తూ మరణించడంతో ఆ కుటుంబానికి ఆధారం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న రిలయన్స్ జియో సీనియర్ మేనేజర్ పోతిరెడ్డి నవీన్, సహ ఉద్యోగులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి 1,05,500 (ఒక లక్ష ఐదు వేల ఐదు వందల) రూపాయల ఆర్థిక సహాయాన్ని మంగళవారం నగదు రూపంలో అందజేశారు. కష్ట కాలంలో తమకు అండగా ఉన్న జియో ఉద్యోగులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సహ ఉద్యోగులు చేసిన ఈ ఆర్థికసాయం పట్ల స్థానికులు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. కార్యక్రమంలో జియో కంపెనీ ఉద్యోగులు కృష్ణం రాజు, శ్రావణ్, సూపర్వైజర్ మణికంఠ, హరీష్, స్థానికులు పాల్గొన్నారు.
————————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
