ఆకేరున్యూస్, హైదరాబాద్ః మాజీ ఎంపీపీ బీఆర్ ఎస్ పార్టీకి చెందిన హరీష్ కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నారు. నిర్మల్ జిల్లా మామడకు చెందిన బీ ఆర్ ఎస్ నాయకుడు మాజీ ఎంపీపీ హరీష్ ను కొంతమంది కిడ్నాప్ చేసి హైదరాబాద్కు ఇన్నోవా వాహనంలో తరలించే ప్రయత్నం చేశారు. ఇన్నోవా మెదక్ జిల్లా తుప్రాన్ మండలం 44 వ జాతీయ రహదారి పై ఉన్న టోల్ గేట్ వద్దకు చేరుకోగానే వాహనం వేగం తగ్గడంతో హరీష్ వాహనంలోనుంచి దూకి తుప్రాన్ పోలీస్ స్టేషన్కు పరుగులు తీశాడు. కొంతమంది వ్యక్తులు తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని తాను వారి చెరనుంచి తప్పించుకొని వస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
…………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
